Header Banner

కరోనా బారిన పడ్డ బాలీవుడ్ హీరోయిన్..! క్వారంటైన్‌లో కుటుంబం!

  Sat May 24, 2025 10:48        Cinemas

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి కలవరపెడుతోంది. ఇప్పటికే చాపకింద నీరులా యాక్టివ్ కేసుల సంఖ్య 250 దాటడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఈ పరిస్థితుల దృష్ట్యా పలు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరిస్తూ, అవసరమైన చర్యలు చేపడుతున్నాయి. వైద్య నిపుణులు కూడా ప్రజలు నిర్లక్ష్యం వీడి, మాస్కులు ధరించడం సహా అన్ని రకాల కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలాంటి ఆందోళనకర పరిస్థితుల్లో, ప్రముఖ బాలీవుడ్ నటి నికితా దత్తా తాజాగా కరోనా వైరస్ బారిన పడ్డారు.

ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. నికితా దత్తాతో పాటు ఆమె తల్లికి కూడా ఈ వైరస్ సోకింది. ఈ సందర్భంగా నికితా దత్తా తన పోస్ట్‌లో, "కొవిడ్ మా అమ్మగారికి, నాకు హలో చెప్పడానికి వచ్చింది. ఈ పిలవని అతిథి ఎక్కువ కాలం మాతో ఉండదని ఆశిస్తున్నాను. ఈ చిన్న క్వారంటైన్ తర్వాత మళ్లీ కలుద్దాం. అందరూ జాగ్రత్తగా ఉండండి," అని పేర్కొన్నారు. గతంలో కూడా నికితా దత్తా ఒకసారి కొవిడ్ బారిన పడి, చికిత్స అనంతరం కోలుకున్న విషయం గమనార్హం.

ఇది కూడా చదవండి: జూన్ 1 నుండి రేషన్ పంపిణీలో కీలక మార్పులు! ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!



అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు సీఐ రాచమర్యాదలు! ప్రజల ఆగ్రహం..!


ఏపీలో మెగా డీఎస్సీ వాయిదా పిటిషన్లు! సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!


భారత్ లో కొత్త బైక్ లాంచ్ చేసిన హోండా! ఆధునిక ఫీచర్లు, ఆకట్టుకునే డిజైన్‌తో...


విజ్ఞానశాస్త్రంలో మరో ముందడుగు! యాంటీమ్యాటర్ రవాణాకు ప్రత్యేక కంటైనర్!


కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ..! ఏం చర్చించారంటే?



ఎంపీ డీకే అరుణకు కీలక బాధ్యత అప్పగించిన కేంద్రం! ధాన్యం సేకరణపై ప్రత్యేక ఫోకస్!

అది నిజం కాకపోతే జగన్ రాజీనామా చేస్తారా? టీడీపీ నేత సవాల్!


తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాలు! కేఆర్ఎంబీ కీలక ఉత్తర్వులు!


సైన్స్‌కే సవాల్..! చంద్రుడినే పవర్ హౌస్‌గా మారుస్తామంటున్న ఎడారి దేశం..!


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #Andhrapravasi #COVID19 #BollywoodNews #NikitaDutta #COVIDPositive #StaySafe #QuarantineLife #HealthAlert